Tamilanadu CM setire to Amith sha

బిజెపిపై తమిళనాడు ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

తమిళనాడులో ఎన్నో ఏళ్లుగా నేషనల్ పార్టీలు జెండా ఎగరేయాలని శతవిధాల ప్రయత్నిస్తున్నా అక్కడ ప్రాంతీయ పార్టీలే ఇప్పటికీ రాజ్యమేలుతున్నాయి. ఇది తమిళనాడు ప్రజల ఐక్యతకు నిదర్శనం అని అక్కడి రాజకీయనేతలు అంటూ ఉంటారు. అయితే తమిళనాడు గత కొన్నేళ్లుగా మాత్రం తమిళనాడు ప్రస్తుత ప్రభుత్వం అయిన డీఎంకే పార్టీపై ఆ పార్టీ నేతలపై పలురకాల విమర్శలు వస్తూనే ఉన్నాయి. అక్కడి కమ్యూనిజం సిద్ధాంతాలు హిందూయిజాన్ని చంపేస్తున్నాయని దేశ వ్యాప్తంగా ఇతర పార్టీల నేతలు విమర్శిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ బిజెపి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

తాజాగా తమిళనాడులో జరిగిన డీఎంకే పార్టీ సభలో ఎం.కె.స్టాలిన్ బిజెపి నేత అమిత్ షాపై తీవ్రమైన ఘాటు వ్యాఖ్యలు చేసారు. సభలో అమిత్ షాని విమర్శిస్తూ “మీరు ఎన్ని జన్మలు ఎత్తినా తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రాదు”. ఇదేమి బీహార్ కాదు.. తమిళనాడు. బీజేపీ పార్టీ నాయకుల ఆటలు ఇక్కడ సాగవు” అని అంటూ “అమిత్ షా కాదు గదా, మొత్తం బీజేపీ నాయకులు వచ్చినా కూడా తమిళనాడులో గెలవలేరు” అంటూ ఎం.కె స్టాలిన్ వ్యాఖ్యానించారు. అయితే “ప్రేమతో వస్తే తమిళనాడు ప్రజలు స్వాగతిస్తారు”, కానీ అహంకారంతో వస్తే తన్ని తరిమేస్తారు” అంటూ బిజెపికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

అయితే కేరళలో తాజాగా మున్సిపల్ ఎలక్షన్లలో బిజెపి కొన్ని చోట్ల తొలిసారి గెలవడం గురించి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాగే తమిళనాడులో కూడా ఏదో ఒకరోజు బిజెపి అడుగుపెడుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు.