Young Sarpanch Sakshi Rawat Inspiring the Youth

యువతరానికి స్పూర్తినిస్తున్న యంగ్ సర్పంచ్..

ప్రస్తుత రోజుల్లో దేశంలో యువతరంలో రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి తగ్గుతుందన్న విషయం తెలిసిందే. ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు వస్తున్నారే తప్ప, యువతలో ఆసక్తి ఉన్నవాళ్లు తక్కువ. అయితే అలాంటి వాళ్లకు స్ఫూర్తినిస్తూ ఓ యంగ్ సర్పంచ్, అది కూడా మహిళా సర్పంచ్ అందరికి ఆదర్శంగా నిలుస్తుంది. ఆమె పేరు సాక్షి రావత్. ఉత్తరాఖండ్ కు చెందిన ఈ అమ్మాయి రీసెంట్ గా బీటెక్ గ్రాడ్యుయేట్ కాగానే అందరిలా సిటీకి వచ్చి పెద్ద ఉద్యోగం చేయకుండా, తన ఊళ్ళోనే తన వాళ్లందరికీ సహాయం చేయాలనుకుంది. దానికి రాజకీయాలే సరైన దారి నిశ్చయించుకుంది.

ఉత్తరాఖండ్ లో కుయి గ్రామానికి చెందిన సాక్షి రావత్ రీసెంట్ గా జరిగిన గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో తన గ్రామ ప్రజలతో ఎన్నుకోబడింది. అంతే కాదు నేటి యువత బతుకుదెరువు కోసం పట్నాలకే వలస పోవాల్సిన పనిలేదని, తాము ఉన్న ఊరిలోనే ఎంతో పని కల్పించవచ్చని నిరూపిస్తుంది సాక్షి. ఇక రీసెంట్ గా మీడియా తో మాట్లాడిన సాక్షి తమ కుయి గ్రామంలో పిల్లలకు మంచి బడి ఏర్పాటు చేయడంతో పాటు, తమ ఊళ్ళో యువతకు ఈ డిజిటల్ యుగానికి తగ్గట్టు స్కిల్స్ నేర్పించడమే తన లక్ష్యమని, అలాగే ఊళ్ళో ప్రధాన సమస్యలని పరిష్కరించి, మహిళలకి ప్రధానంగా ఉపాధి హామీలు కల్పించడమే తన లక్ష్యమని పేర్కొంది. ఇక మొన్నా మధ్య బీహార్ లో బెనిపెట్టి నియోజకవర్గం నుండి మైథిలి ఠాకూర్ అనే 25 ఏళ్ళ అమ్మాయి కూడా ఎమ్మెల్యే గా గెలిచిన విషయం తెలిసిందే.